ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై సమాచారాన్ని బహిరంగ పరచడానికి అనేక వారాలు పడుతుందని SBI చెప్పడం… ఎవరినో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లుందని ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై SBI… సుప్రీం కోర్టు తలుపుతట్టడం అవివేక చర్య అని అన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత బ్యాంకు అభ్యర్థనను కోర్టు ఆమోదించడం అంత సులభం కాదన్నారు. గడుపు కోరుతూ SBI వేసిన పిటిషన్‌ను మార్చి 11న సుప్రీం కోర్టు విచారించనున్న నేపథ్యంలో సిబల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
SBI గడువు కావాలని కోరుతోందని కారణాలు సుస్పష్టమన్నారు. ఈ విషయాలను న్యాయస్థానం పరిశీలిస్తుందని ధీమాగా చెప్పగలనన్నారు. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనే సమాచారాన్ని సేకరించేందు కు చాలా సమయం పడుతుం దని SBI చెబుతోందని, అలా చెప్పడం పిల్లచేష్టగా ఉందన్నారు. ప్రస్తుతం మోదీ చెప్పినట్లుగా డిజిటలైజేషన్ కాలంలో ఉన్నామని కపిల్ సిబల్ తెలిపారు. ప్రభుత్వాన్ని రక్షించడమే SBI ఉద్దేశమనే విషయం స్పష్టమవుతోందని కపిల్ సిబల్ అన్నారు. ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న వేళ జూన్ 30వరకు గడువు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించదన్నారు. ఒకవేళ ఈ వివరాలను వెల్లడిస్తే రాబోయే ఎన్నికల్లో అదే బహిరంగ చర్చ అవుతుందనే విషయం కూడా SBIకి తెలుసునన్నారు కపిల్ సిబల్.


