28.2 C
Hyderabad
Sunday, March 3, 2024
spot_img

మంచు లక్ష్మి కెరీర్‌లోనే చిరస్థాయిగా నిలిచిపోయే ‘ఆదిపర్వం’

రావుల వెంకటేశ్వర్రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ – అమెరికా ఇండియా (ఎ.ఐ) ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఆదిపర్వం”. బహుముఖ ప్రతభాశాలి సంజీవ్ మేగోటి దర్శకుడు. మంచు లక్ష్మి ముఖ్యపాత్ర పోషిస్తున్న “ఆదిపర్వం” చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

“అమ్మోరు – అరుంధతి” చిత్రాల తరహా ఈవిల్ పవర్ అండ్ డివోషనల్ పవర్ మధ్య జరిగే పవర్ ఫుల్ మూవీ ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పాలి. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ “ఆదిపర్వం”. గ్రాఫిక్స్ ప్రధానమైన చిత్రంగా మలిచారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అలాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగానే కాకుండా ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి పోషిస్తున్న పాత్ర ఆమె కెరీర్లోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. మంచు లక్ష్మి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శకనిర్మాతలు.

చిత్ర దర్శకుడు సంజీవ్ మెగోటి మాట్లాడుతూ… “మంచు లక్ష్మీప్రసన్న ఇదివరకు చెయ్యని పాత్రలో కొత్తగా కనిపిస్తారు. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్స్‌గా నిలుస్తాయి. అన్వికా ఆర్ట్స్, అమెరికా ఇండియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థల సహకారంతో నేను అనుకున్న స్థాయిలో ఒక గొప్ప చిత్రాన్ని మలిచానన్న నమ్మకం నాకుంది. మంచులక్ష్మి గారి క్యారెక్టర్ ఆవిడ పెర్ఫామెన్స్ కూడా మెమొరబుల్‌గా ఉంటాయి” అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావ్ మాట్లాడుతూ.. “రెట్రో ఫీల్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆద్యంతం అలరించే చిత్రంగా రూపుదిద్దారు దర్శకులు సంజీవ్ మేగోటి” అని చెప్పారు. ఫైట్స్, గ్రాఫిక్స్ చాలా ప్రశంసలందుకుంటాయని సహనిర్మాత గోరెంట శ్రావణి తెలిపారు!!

ఈ చిత్రంలో ఆదిత్యఓం, ఎస్తేర్, సుహాసిని ,శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి , హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి కాత్రి, మధు నంబియార్, బృంద, స్నేహ అజిత్, అయేషా, జ్యోతి, శ్రావణి, గూఢా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, డీఎస్పీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Latest Articles

పాలమూరు – రంగారెడ్డిపై కాంగ్రెస్ ఆరోపణలు

   దక్షిణ తెలంగాణ వరదాయనిగా పేరొందిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కరువుసీమగా పేరున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటిని పారించే ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన పాలమూరు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్