ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో, తెలుగు రాష్ట్రాలలో తన కొత్త వివో X200 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్‌ను దక్షిణాది నటి సంయుక్త మీనన్ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటి సంయుక్త మీనన్ మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో కొత్త వివో X200 సిరీస్ ZEISS ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచం లో ఎక్కడా ఉన్నా మొబైల్ ఫోన్ వ్యవస్థ మానవ సంబంధాలకు చేరువలో ఉంచుతుదదన్నారు.
వివో ఇండియా సీఎస్ఓ ఆశ్విని భాస్కర్ మీడియాతో మాట్లాడుతు, X200 సిరీస్, మొబైల్ ఫోటోగ్రఫీ పనితీరుకు కొత్త మించును అందించే ఫ్లాగ్‌షిప్ లైన్‌అప్ అని అన్నారు. X200 సిరీస్‌లో వివో యొక్క స్వంత డ్యుయల్ ఫ్లాగ్‌షిప్ చిప్ ఉంటుందని, ఇది V3+ ఇమేజింగ్ చిప్‌ని మిడియా టెక్ డిమెన్సిటీ 9400 ప్రొసెసర్‌తో కలిపి ఉందని, ఈ కాంబినేషన్ కారణంగా నిరంతర పనితీరు, సమర్థవంతమైన బ్యాటరీ జీవితకాలం, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలు అందిస్తాయని చెప్పారు.
X200 సిరీస్‌లో కొత్తగా నవీకరించిన వివో ZEISS కో-ఎంజనీర్డ్ ఇమేజింగ్ సిస్టమ్ ఉంది, ఇది అత్యాధునిక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలను కలిపి, తగినంత అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవాలను అందించడమే కాకుండా మరింత మెరుగైన పోర్ట్రెయిట్ మోడ్‌లు, అద్భుతమైన లో-లైట్ పనితీరు, AI ఆధారిత ఫీచర్లు కలిగిన X200 సిరీస్ మొబైల్ ఫోటోగ్రఫీకి విప్లవాత్మక మార్పు ను తీసుకువచ్చిందన్నారు.
నటి సంయుక్త మీనన్ తో వివో ఇండియా సీఎస్ఓ ఆశ్విని భాస్కర్ , అటిష్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జీఎమ్), వసంత్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీజీఎమ్) ఇతర వివో అధికారులతో కలిసి ఈ సిరీస్‌ను ఆవిష్కరించారు. జారూ ఛానెల్ హెడ్, ఎం పి ఈశ్వర్ (సీనియర్ టర్మినల్ హెడ్), బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ హెడ్ గిరి, విషాల్ (మార్కెటింగ్ హెడ్) కూడా ప్రారంభోత్సవంలో ఉన్నారు.