స్వతంత్ర వెబ్ డెస్క్: సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది స్టన్నింగ్ బ్యూటి సమంత. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది అనతికాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇక ఆ సినిమాలు హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఇక ఇటీవల యశోదతో మంచి హిట్ అందుకున్న సామ్ శాకుంతలం సినిమాతో డిజాస్టర్ చవిచూసింది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్సుతో బిజీగానే గడిపింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా సమంత షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఏడాది పాటు సినిమాల నుంచి బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో సామ్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నట్లు తెలుస్తోంది.
సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేసురుకుంది. మరో మూడు రోజులో ఖుషి చివరి షెడ్యూల్ కూడా పూర్తవుతుంది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. మరోవైపు సమంత చేతిలో ఉన్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. ప్రస్తుతం సమంత ఎలాంటి కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేయదు. గతంలో తీసుకున్న నిర్మాతలకు అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారట. దాదాపుగా ఓ సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని సామ్ నిర్ణయం తీసుకున్నారట. ఈ సమయాన్ని తన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి మరియు అదనపు చికిత్స కోసం వెచ్చించనున్నారట. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే సమంత తిరిగి సినిమాలపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. ‘ఖుషి’ సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటారో లేదో.
ఇటీవల విడుదల అయిన ‘శాకుంతలం’ సినిమా సమంతకు భారీ షాక్ ఇచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో తన తర్వాతి ప్రాజెక్టులపై సమంత ఆచితూచి అడుగులు వేస్తుందనుకున్నారు అంతా. ఈ లోపే బ్రేక్ తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు.