34.2 C
Hyderabad
Monday, May 27, 2024
spot_img

శామ్‌ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

దశలవారీగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తరచూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. దీంతో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో అసలు సమస్యలు పక్కకు పోతున్నాయి. నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లు అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలే హైలెట్ అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారతదేశాన్ని వైవిధ్యభరితమైన దేశంగా అభివర్ణించే క్రమంలో శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలువివాదాస్పదమయ్యాయి. దక్షిణ భారతీయులు, ఆఫ్రికన్లుగా కనిపిస్తారంటూ పిట్రోడా కామెంట్ చేశారు. అలాగే భారత్‌లోని పశ్చిమ రాష్ట్రాలవారు అరబ్బుల్లాగా, ఈశాన్య రాష్ట్రాలవారు చైనీయుల్లా కనిపిస్తారని కామెంట్ చేశారు శామ్‌ పిట్రోడా. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారాయన.

దక్షిణాదివారిని ఆఫ్రికన్లతో పోల్చుతూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం ఇదే తొలిసారి కాదు. కొన్ని రోజుల కిందట వారసత్వ పన్ను కామెంట్స్‌తో కాంగ్రెస్‌కు తలనొప్పి తెచ్చి పెట్టారు పిట్రోడా. వారసత్వ పన్ను చట్టం గురించి శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపాయి. తమ ప్రభుత్వం వస్తే దేశ సంపదను మళ్లీ పంపిణీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి మద్దతుగా వారసత్వ పన్ను చట్టాన్ని శామ్‌ పిట్రోడా ప్రస్తా వించారు. అమెరికాలో ప్రస్తుతం వారసత్వ పన్ను అమల్లో ఉందన్నారు శామ్‌ పిట్రోడా. అటువంటి విధానం మనదేశంలోనూ అమల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు పిట్రోడా. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు శామ్‌ పిట్రోడా.

ఇక్కడ వారసత్వ పన్ను చట్టం గురించి తెలుసుకోవాలి. అమెరికాలో మరణించిన వారికి ఎవరికైనా 100 మిలియన్ డాలర్ల ఆస్తి ఉంటే అందులో కేవలం 45 శాతం మాత్రమే సదరు వ్యక్తి వారసులకు చెందుతుంది. మిగతా 55 శాతం ఆస్తి ప్రభుత్వ పరం అవుతుంది. వ్యక్తిగత ఆస్తిలో కొంతభాగం తప్పనిసరిగా సమాజానికి చెందాలన్న సదుద్దేశంతో అమెరికా వారసత్వ పన్ను చట్టాన్ని రూపొందించారు. వారసత్వ పన్ను చట్టం వివాదంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. దేశంలో వారసత్వ పన్ను విధించే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదని జైరామ్ రమేశ్ వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి చట్టం తీసుకురావాలని తాము అనుకుంటున్నట్లు బీజేపీ సర్కారే గతంలో వెల్లడించిం దని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా 1985లో ఎస్టేట్ పన్నును అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ రద్దు చేసిన విష యాన్ని జైరామ్ రమేశ్ వెల్లడించారు. అయితే శామ్‌ పిట్రోడా ప్రతిపాదించిన వారసత్వ పన్ను చట్టం కూడా చివరకు వివాదంగా మారింది. లోక్‌సభ ఎన్నికల వేళ హస్తం పార్టీకి తలనొప్పి తీసుకు వచ్చింది. రోజులు గడిచేకొద్దీ ఈ వివాదం
చల్లారింది.

    ఇదిలా ఉంటే దక్షిణాదివారికి ఆఫ్రికన్లకు పోలికలు ఉంటాయంటూ శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. దక్షిణాదివారిని ఆఫ్రికన్లతో పోల్చడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్త మైంది. పిట్రోడా వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. పరిస్థితి చిలికి చిలికి గాలివానగా మారబోతున్న దశలో కాంగ్రెస్ అధిష్టానం వెంటనే అప్రమత్త మైంది. శామ్‌ పిట్రోడా కామెంట్స్‌తో హస్తం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు జై రామ్ రమేశ్‌. ఈ మేరకు జై రామ్ రమేశ్‌ ట్వీట్ చేశారు. వ్యక్తిగత హోదాలోనే దక్షిణాదివారిపై శామ్‌ పిట్రోడా కామెంట్స్ చేశారంటూ వివరణ ఇచ్చారు. హస్తం పార్టీని వివాదం నుంచి బయటపడేయడానికి జై రామ్ రమేశ్‌ తన శక్తి మేరకు ప్రయత్నిం చారు. అసలు జరిగిందేమిటో, శామ్‌ పిట్రోడా ఎందుకు అలా వ్యాఖ్యలు చేశారో భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని చెప్పడానికి శామ్‌ పిట్రోడా కొన్ని పోలికలు చేశారు. ఇందులో భాగమే దక్షిణాదివారిని ఆఫ్రికన్లతో పోల్చడం. భారతదేశంలో ప్రాంతాలవారీగా, మతాలవారీగా, సంస్కృతిపరంగా ఎన్ని తేడాలున్నా భారతీయులం దరూ సహోదరులే అన్నారు శామ్‌ పిట్రోడా. శామ్‌ పిట్రోడా ఏ ఉద్దేశంతో అన్నా ఆయన కామెంట్స్‌ వివాదా స్పదంగా మారాయ న్నది వాస్తవం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు శామ్‌ పిట్రోడా. కాగా పిట్రోడా అలా రాజీనామా చేశారో లేదో సదరు రాజీనామాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించడం కూడా చకచకా జరిగిపోయింది.

Latest Articles

ఆ ప్రశ్నకు ‘ల‌వ్‌, మౌళి’లో సమాధానం దొరుకుతుంది: నవదీప్

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్