23.9 C
Hyderabad
Sunday, August 31, 2025
spot_img

తొలిసారి దీపావళి పండుగకి ‘టైగర్ 3’తో సందడి చేయబోతున్న సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా పలు చిత్రాల్లో నటించి ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా పేరుని సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏది దీపావళి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. తొలిసారి ఈ జోడీ నటించిన ‘టైగర్ 3’ దీపావళికి సందడి చేయనుంది. తమ అభిమానులు, సినీ ప్రేక్షకులనే కాదు యావత్ ప్రపంచానికి వీరు తమ అద్భుతమైన ప్రదర్శనతో మెప్పించబోతున్నారు.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘‘దీపావళి పండుగకి సిినిమా రిలీజ్ కావటం అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆరోజుల్లో విడుదలయ్యే చిత్రాలను ప్రేక్షకుల ఆస్వాదించటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలా దీపావళి రోజున విడుదలైన నా చిత్రాలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. అయితే నాకు, కత్రినాకు ఈ దీపావళి పండుగ మరెంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పటి వరకు మేం కలిసి నటించిన ఏ సినిమా కూడా దీపావళికి రిలీజ్ కాలేదు. తొలిసారి ‘టైగర్ 3’ రిలీజ్ కానుంది. కాబట్టి మేం ఎంతో ఆనందంతో, ఆసక్తికరంగానూ ఎదురు చూస్తున్నాం. దీపావళి అంటే వ్యక్తులే కాదు, కుటుంబాలు కూడా ఒక చోటికి చేరుతాయి. నాకు కావాల్సిన వారితో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవటానికి నేను ఇష్టపడతాను. అలాగే నా కుటుంబ సభ్యులందరితో కలిసి టైగర్ 3 సినిమాను చూస్తాను. అందరూ ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని పొందుతారని భావిస్తున్నాను’’ అన్నారు.

కత్రినా కైఫ్ మాట్లాడుతూ ‘‘దీపావళి పండుగ అంటే అందరికీ ప్రత్యేకమైనది. అయితే ఈఏడాది నాకు మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే నేను, సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ రిలీజ్ అవుతుంది. చెడుపై మంచి ఎలా విజయం సాధించిందనే విషయాన్ని ఇందులో చూపించాం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి రోజునే టైగర్ 3 రిలీజ్ కావటం ఆనందంగా ఉంది. నేను, సల్మాన్ ఖాన్ నటించిన సినిమాల్లో తొలిసారి దీపావళికి రిలీజ్ అవుతున్న సినిమా ఇది. కచ్చితంగా మేం ప్రేక్షకులను మెప్పిస్తాం. ప్రేక్షకులకు మరింత సంతోషాన్ని, ఎగ్జయిట్‌మెంట్‌ను అందిస్తాం. దీపావళి అంటే సెలబ్రేషన్స్. అందరూ ఓచోటకు చేరటం, ప్రేమ, సంతోషాన్ని కుటుంబ సభ్యులు కలిసి సెలబ్రేట్ చేసుకోవటం అనేది మన మధ్య ఉన్న స్నేహ బంధాలను, బాంధవ్యాలను మరింతగా ధృడపరుస్తాయి’’ అన్నారు.

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్