29 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

మహిళా రెజ్లర్ల ఆందోళన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్

స్వతంత్ర, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ, భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్స్ చేపట్టిన ఆందోళనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆందోళన నుంచి సాక్షి మాలిక్ తప్పుకుంది. తిరిగి ఆమె ఉత్తర రైల్వేలోని తన పదవిలో చేరినట్లు తెలుస్తోంది. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సాక్షి మాలిక్ తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇక ఈ నెల 9వ తేదీ లోపు బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయకపోతే తమ పతకాలను గంగా నదిలో పడేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్రిజ్ భూషణ్‌‌పై రెండు FIRలు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో సాక్షి నిర్ణయంతో మిగిలిన రెజ్లర్లు ఎంతవరకు పోరాడుతారో వేచి చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్