స్వతంత్ర, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ, భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్స్ చేపట్టిన ఆందోళనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆందోళన నుంచి సాక్షి మాలిక్ తప్పుకుంది. తిరిగి ఆమె ఉత్తర రైల్వేలోని తన పదవిలో చేరినట్లు తెలుస్తోంది. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సాక్షి మాలిక్ తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇక ఈ నెల 9వ తేదీ లోపు బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయకపోతే తమ పతకాలను గంగా నదిలో పడేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్రిజ్ భూషణ్‌పై రెండు FIRలు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో సాక్షి నిర్ణయంతో మిగిలిన రెజ్లర్లు ఎంతవరకు పోరాడుతారో వేచి చూడాలి.