Sajjala : వివేకా హత్య కేసులో సీబీఐ(CBI) విచారణ తుది దశకు వచ్చిన సమయంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ రిపోర్టును సీబీఐ ఎందుకు పక్కన పెట్టిందని.. చంద్రబాబు(Chandrababu) దర్శకత్వంలోనే విచారణ జరుగుతుందని ఆరోపించారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బీటెక్ రవి, చంద్రబాబు ఫోన్ రికార్డింగులు ఎందుకు పరిశీలించడం లేదని ఆయన ప్రశ్నించారు. గూగుల్ టేక్ఔట్ అనే టెక్నాలజీ గురించి కొత్తగా వింటున్నామని.. సీబీఐ దగ్గర సరైన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సజ్జల డిమాండ్ చేశారు. ఈ కేసును జగన్(Jagan) మెడకు చుట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనపడుతోందన్నారు. వివేకా హత్య కేసులో అసలైన కుట్రదారులను అరెస్ట్ చేయాలని.. ఈ కేసుతో సంబంధం లేని అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అంతకన్నా ఘోరం మరొక్కటి ఉండదన్నారు సజ్జల(Sajjala).