వాలంటీర్లపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండేళ్ల నుంచి వాలంటర్ల మీద చంద్రబాబు అండ్ బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల వ్యవస్థను జగన్ తీసుకువచ్చారన్న ఆయన…. ఇంటి దగ్గరకే పథకాలు అందిస్తున్నా మన్నారు. ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చి వాలంటర్లను తప్పించార న్నారు. ఇప్పుడు పెన్షన్లకు డబ్బులు లేవని చంద్రబాబు ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.