ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ

రౌస్‌ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌, మనీలాండరింగ్‌ కేసులో మార్చి 26న కవిత మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందు వల్ల తనకు ఏప్రిల్‌ 16 వరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత కోరారు. దీనిపై ఏప్రిల్‌ 1న విచారించిన న్యాయస్థానం…ఈడీని వివరణ కోరింది. . కవిత పిటిషన్‌పై ఈడీ కౌంటర్‌ దాఖలు చేసింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని ఈడీ కోరింది. కవిత బెయిల్‌ ఇస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ భావిస్తోంది. కవిత తరపున అభిషేక్‌ సింఘ్వీ … వాదనలు వినిపిస్తున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన కవిత విచారణను ఎదుర్కొంటోన్నారు. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఆమె బెయిల్ పిటీషన్‌పై మొదటిసారి ఏప్రిల్‌ 1న ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని, తల్లిగా తోడుగా నిలవాల్సిన అవసరం ఉందంటూ ఆమె మధ్యంతర బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేయగా.. దాన్ని విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా కవిత తరఫు అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపించారు. మధ్యంతర బెయిల్‌తో పాటు రెగ్యులర్ బెయిల్‌ను కూడా మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఇన్ని రోజులపాటు చేపట్టిన విచారణల సందర్భంగా కవిత నుంచి ఎలాంటి సమాచారాన్ని కూడా ఈడీ రాబట్టుకోలేకపోయిం దని, ఈ కేసు కుట్రపూరితమైనదనీ చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం కవితకు ఎలాంటి బెయిల్ మంజూరు చేయాలనేది మొదట తేల్చుకోవాలని అభిషేక్ మను సింఘ్వీకి సూచించారు. ఆమెకు మధ్యంతర బెయిల్ కావాలా? లేక రెగ్యులర్ బెయిల్ కోసం వాదిస్తున్నారా? అనేది స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఈ పిటీషన్‌పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్