బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన ఒక రోజు తర్వాత పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక డేటా, పోలీసు ఇన్‌ఫార్మర్ల సాయంతో తీవ్రంగా గాలింపు అనంతరం ఓ వ్యక్తిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం బాంద్రా పోలీస్ స్టేషన్‌లో అనుమానిత వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఉదయం ఆ వ్యక్తిని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తున్న దృశ్యాలు కనిపించాయి. అతని గురించి పెద్దగా తెలియదు. అయితే నిన్న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి అతనిపై దాడి చేసిన వ్యక్తి అతడేనా అనేది కూడా ధృవీకరించబడలేదు.
నిన్న దాడి ఘటన తర్వాత బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానితుడు కనిపించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అతను కనిపించకుండా తప్పించుకోవడానికి పారిపోయే ముందు దుస్తులు మార్చుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి టెక్నికల్ డేటాను సేకరించి ఇన్‌ఫార్మర్‌లను ఉపయోగించి నిందితుడి ఆచూకీ కోసం గాలించారు.
మిస్టర్ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని వెతకడానికి పోలీసు బృందాలు వసాయ్, నలసోపరాలో కూడా క్యాంప్ చేస్తున్నాయి. అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలోని 12 అంతస్తుల భవనం ‘సద్గురు శరణ్’లోకి చొరబడిన వ్యక్తి దొంగతనం కోసం వచ్చాడని అంటున్నారు.
అగంతకుడు నటుడి ఇంట్లో పనిచేస్తున్న వారిలో ఒకరికి తెలిసినవాడని , లాబీలోని సిసిటివి కెమెరాలలో దొరక్కుండా అతను ఇంట్లోకి ప్రవేశించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనికి భవనం లేఅవుట్ గురించి బాగా తెలుసునని , ప్రక్కనే ఉన్న కాంపౌండ్ గోడ ద్వారా భవనం ప్రాంగణంలోకి ప్రవేశించి.. ఆ తర్వాత పై అంతస్తులకు చేరుకోవడానికి ఫైర్ ఎస్కేప్‌ను వాడినట్టు పోలీసులు భావిస్తున్నారు.