Medico Preethi Case |రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈకేసులో పోలీసులు విచారణ కొనసాగుతుంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను పోలీసులు విచారిస్తున్న క్రమంలో.. నిజాలను వెల్లడించారు. సైఫ్ ప్రీతిని తను ర్యాగింగ్ చేసినట్లు ఒప్పుకున్నాడు.
సైఫ్(Saif) తాను చేసిన తప్పును ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు పోలీసులు. దాదాపు నాలుగు రోజుల పాటు విచారణ చేపట్టి ఆధారాలతో సైఫ్ ను టార్గెట్ చేశారు. పోలీసులు చూపిన ఆధారాలతో ఇక సైఫ్ తాను తప్పించుకోలేనని భావించి.. ఇక చేసేదేం లేక నిజం అంగీకరించినట్లు సమాచారం. సైఫ్ కస్టడీ ముగిసిన తర్వాత మార్చి 6న కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలోనే పోలీసులు కోర్టుకు సమర్పించాల్సిన కన్ఫెషన్ నివేదికలో ఈ విషయాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.