స్వతంత్ర, వెబ్ డెస్క్: రైతులకు లబ్ధి చేకూరేందుకు కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ జూన్ 1న రైతు భరోసా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది రైతులు పీఎం కిసాన్ నిధుల కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తొలివిడత సాయం కింద ప్రభుత్వం రూ.5,500 మాత్రమే విడుదల చేసింది. మిగిలిన రూ.2000 కేంద్రం ప్రభుత్వం పీఎం కిసాన్ కింద త్వరలోనే విడుదల చేస్తుంది. కనుక ప్రస్తుతం రూ.5,500 మాత్రమే జమ అవుతుంది. మీ ఖాతాల్లో రైతు భరోసా నిధులు పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ నమోదుచేయాలి. అనంతరం మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. డబ్బులు పడితే Payment Success అని చూపిస్తుంది. అదే డబ్బులు ఇంకా పడకపోతే Payment Under Processing అని కనపడుతుంది. అంటే మీ ఖాతాలో కొన్ని రోజుల్లో డబ్బులు పడతాయని అర్థం.