Andrey Botikov |ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన తొలి శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. రష్యాకు చెందిన సైటింస్ట్ ఆండ్రీ బొటికోవ్(Andrey Botikov), కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి(Sputnik-V) తయారీలో కీలక పాత్ర తయారుచేశాడు. మాస్కోలోని తన అపార్టుమెంట్ లో ఉన్న బొటికోవ్(Botikov)ను ఓ దుండగుడు బెల్ట్ తో ఊపిరి ఆడకుండా చంపేశాడు. ఈ విషయాన్ని రష్యా పోలీసులు ధృవీకరించారు. నేరచరిత్ర కలిగిన 29 ఏళ్ల యువకుడు బొటికోవ్ తో గొడవపడి ఆయన మెడకు బెల్ట్ బిగించి హత్య చేసి పరారయ్యాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా ప్రపంచంలోనే తొలి కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసినందుకు 2021లో రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) చేతుల మీదుగా ‘ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ ఫర్ ది ఫాదర్ లాండ్ అవార్డ్’ను బొటికోవ్ అందుకున్నారు. 2020లో స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తల్లో బొటికోవ్ ఒకరుగా ఉన్నారు.