Mukesh Ambani driver |కారు డ్రైవర్లకు మహా అయితే నెల జీతం ఎంత ఉంటుంది. ఓ 20వేలు లేదా 30వేలు. కానీ ఓ డ్రైవర్ జీతం నెలకు రూ.2లక్షలు అంటే నమ్ముతారా? అది కూడా 2017లో. ఆరేళ్ల కిందటే రూ.2లక్షల జీతం ఉంటే ఇప్పుడు ఎంత ఉంటుందో మరి. పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు చేసే వారికి కూడా నెలకు అంత జీతం ఉండదు కదా. ఇంతకీ ఆ డ్రైవర్ ఎవరు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. అతనే ప్రపంచ కుబేరుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) పర్సనల్ కారు డ్రైవర్. ఓ కాంట్రాక్ట్ సంస్థ ద్వారా అంబానీ డ్రైవర్ గా అతడిని నియమించుకున్నారని తెలుస్తోంది. ఏ తరహా రోడ్ల పైన అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కారు నడిపే సత్తా ఈ డ్రైవర్ కు ఉందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కోట్ల రూపాయలు సంపాదించే సెలబ్రెటీల దగ్గర పనిచేసే వారికి ఆ మాత్రం జీతం లేకపోతే ఎలా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.