31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

Mutual Funds |పిల్లల చదువు కోసం పొదుపు చేయాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే మీకు తిరుగుండదు..

Mutual Funds |ఒక కుటుంబం ముందుగా ఆలోచించేది తమ కుటుంబ పోషణ.. ఆ తర్వాత పిల్లల చదువు.. ఎవరైనా తమ పిల్లలను మంచిగా చదివించాలని కోరుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్య చాలా భారంగా తయారైంది. లక్షల్లో ఫీజులు చెల్లించడం మధ్యతరగతి ప్రజలకు తలకుమించిన భారం అవుతుంది. ప్రస్తుతం చదువులకు సమబంధించిన వివిధ రకాల కోర్సుల ఫీజులను తెలుసుకున్నపుడు కచ్చితంగా ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఎందుకంటే.. ఇంజనీరింగ్ కోర్సులకు 12 నుంచి 20 లక్షల రూపాయలు.. మెడికల్ కోర్సులకు 30 లక్షల నుంచి కోటి రూపాయలు.. ఎంబీఏ లాంటి కోర్సుల కోసం 25 లక్షల రూపాయల వరకూ ఫీజులు ఉన్నాయి.

ఈ ఫీజుల గురించి తెలుసుకుంటే భవిష్యత్తులో తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందోననే ఆందోళన ఉంటుంది. ఈ ఫీజుల గురించి ఆలోచిస్తే పేద, మధ్య తరగతులకు చెందిన వారి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల చదువు పూర్తయ్యే సమయానికి వివిధ రకాల ఖర్చులు ఉంటాయి. ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజులు పెరుగుతాయి, రవాణా ఖర్చులు కూడా ఉంటాయి. అలాగే మీ పిల్లలు మీ ఇంటికి దూరంగా మరొక నగరంలో చదువుకోవడానికి వెళితే, అప్పుడు అక్కడ అయ్యే ఖర్చులను కూడా కలిపి చూసుకుంటే ఈ చదువుల కోసం అయ్యే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. అయితే, విద్యా ఖర్చు కేవలం ఇన్స్టిట్యూట్ ఖర్చులు.. కోర్సుల ఫీజుల ద్వారా మాత్రమే లెక్క వెయ్యలేం. దీనికి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. అందుకే పిల్లల ఉన్నత చదువుల కోసం చాలా ముందుగానే ఆలోచించి లెక్కలు వేసుకుని పెట్టుబడి పెట్టడం అవసరం.

పిల్లలకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడం అనేది తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యత అలాగే లక్ష్యం గా కూడా ఉంటుంది. దీని కోసం, డబ్బు ఆదా చేయడం ఒక్కటే సరిపోదు, పెట్టుబడి పెట్టడం కూడా అవసరం. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కు మీరు ఎంత ఎక్కువ సమయం ఇస్తే, రాబడులకు అంత మంచి స్కోప్ ఉంటుంది. రాబడి కోరుకునేవారు ఈక్విటీ. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం 8-10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉంటే, అటువంటి కాలపరిమితిలో, మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా 12-14% వార్షిక రాబడి ఇస్తున్న ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంటాయి.

మీ చేతుల్లో ఎంత సమయం ఉందో దాని ప్రకారం, మీరు మ్యూచువల్ ఫండ్లను ఎలా ఎంచుకోవాలో అర్థం చేసుకోండి. మీకు 5 సంవత్సరాల కంటే తక్కువ సమయం ఉంటే, డెట్ మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds), బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. 6-7 సంవత్సరాల సమయం ఉంటే, అప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయి. 10 సంవత్సరాల వరకు సమయం ఉంటే, పెద్ద క్యాప్‌లతో పాటు మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లు మంచి ఎంపిక.

మీరు ప్రతి నెలా 10,000 రూపాయల SIP తీసుకుంటే, 12 శాతం రాబడిని ఊహిస్తే, మీరు 5 సంవత్సరాలలో మొత్తం 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. మీ రాబడి 8,24,864 రూపాయలు అంటే 2,24,864 రూపాయల లాభం. కానీ మీరు అదే 10,000 ను 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, మొత్తం పెట్టుబడి మొత్తం 12 లక్షల రూపాయలు మరియు మొత్తం రాబడి 23,23,391 రూపాయలు. అంటే మీరు 11,23,391 రూపాయల అధిక రాబడిని పొందుతారు. అందువల్ల, పిల్లవాడు చిన్న వయస్సులో ఉన్నప్పుడు, పెట్టుబడిని ముందుగానే ప్రారంభించడం చాలా ముఖ్యం, తద్వారా మీరు పెద్ద కార్పస్‌ను సంపాదించవచ్చు. దీంతో మీ పిల్లవాడి ఉన్నత విద్య కోసం ఖర్చుల ఇబ్బందిని సులభంగా అధిగమించవచ్చు.

 Read Also:  శరీరంలో కొవ్వు పెరిగిపోతుందా.. సులభంగా కరిగించే సింపుల్‌ టిప్స్‌ మీకోసం..

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘లియో’ ఆడియో ఫంక్షన్‌ క్యాన్సిల్‌.. అసలు కారణమిదే..

స్వతంత్ర వెబ్ డెస్క్: సెప్టెంబ‌ర్ 30న చెన్నైలో నిర్వ‌హించాల్సిన ద‌ళ‌ప‌తి విజ‌య్ లియో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. లియో సినిమా విషయంలో ఉదయనిధి స్టాలిన్ కాస్త ఒత్తిడి తెస్తున్నాడని,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్