రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. నల్గొండలోని 12వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల సస్పెన్షన్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. పోలీసు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హోం శాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉందన్నారు. రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవంలో పాల్గోన్న రోజే.. పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డు ఎక్కాయని అన్నారు. భార్యలు రోడ్డెక్కితే.. భర్తలను సస్పెండ్ చేసే చట్టం ఎక్కడా లేదు అని అన్నారు.