గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీ ఫోకస్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపు కేటీఆర్ నాయకత్వంలో మరోసారి నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పోరేటర్ల సమావేశం జరగబోతుంది. మూడు రోజుల క్రితం మాజీమంత్రి తలసాని నివాసంలో సిటీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.
జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టే అంశంపై రేపటి మీటింగ్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అవిశ్వాసం పెట్టేందుకు కావాల్సిన బలంపై బీఆర్ఎస్ లెక్కలేసుకుంటోంది. అవిశ్వాసానికి బీజేపీ మద్దతు తీసుకుంటే ఎలా ఉంటుంది అనే దానిపై సమాలోచనలు చేస్తోంది.
మరోవైపు హైదరాబాద్ ఎమ్మెల్యేలు చేజారకుండా రంగంలోకి కేటీఆర్ దిగారు. స్థానిక సంస్థల ముందు ఎమ్మెల్యేలు చేజారితే కష్టమనే భావనలో గులాబీ పార్టీ ఉంది. హైదరాబాద్ సిటీలో పట్టు నిలుపుకోవాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తోంది.