మహారాష్ట్రలోని పూణెలో జరిగిన రోడ్డు ప్రమాదంతో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు దుర్మరణం పాలైయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు కారులో వెళ్లారు. దర్శనం అనంతరం వివిధ పర్యాటన ప్రాంతాలు సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవా రం రాత్రి పూణె సమీపంలో కారు టైరు పేలడంతో అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకు న్నాయి.