తెలంగాణలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. రాష్ట్రంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో జనాలపై కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలతోపాటు పెద్దవారిపై కూడా కుక్కలు దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. తాజాగా కుక్కల దాడి చేయడంతో మరో బాలుడికి తీవ్ర గాయా లయ్యాయి. సంగారెడ్డి జిల్లా శ్రీనగర్‌కాలనీలో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిని వీధికుక్కలు చుట్టుముట్టి దాడి చేశాయి. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడికి చేరుకుని కుక్కలను తరిమివేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కల దాడులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
తెలంగాణలో వీధి కుక్కల స్వైర విహారం
0
228
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


