హైదరాబాద్‌లో యూసుఫ్గూడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందింది. బస్సు దిగే ప్రయత్నంలో కదులుతున్న ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి మరణించింది. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని యూసుఫ్ గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన అమ్మాయిని మెహ్రీన్‌గా పోలీసులు గుర్తించారు. బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో బాధితురాలు మెహ్రీన్ అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన అమ్మాయి హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడ లోని మాస్టర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువు తోంది. విద్యార్థి బస్సు చక్రాల కింద జారి పడిన ఘటనకు సంబంధించిన వీడియో సిసిఫుటేజీలో రికార్డ్ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


