పిఠాపురంలో జనసేన టీమ్ బస చేస్తున్న హోటల్స్ పై అధికారులు దాడులు చేశారు. పిఠాపురం- సామర్లకోట రోడ్డులో జనసేన టీమ్ బస చేసిన హోటల్ గోకులం గ్రాండ్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టింది. నిన్న రాత్రి హోటల్ రూమ్‌లలో క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. ప్రత్యేక బృందం హోటల్‌కు చేరుకుని జనసేన కార్యకలాపాలపై ఆరా తీసింది. హోటల్‌లో ఎవరెవరు ఉంటున్నారు..? ఎన్ని రోజులు నుండి బస చేస్తున్నారు? వంటి అంశాలపై అధికారులు ఆరా తీశారు.


