22.3 C
Hyderabad
Sunday, August 31, 2025
spot_img

కిషన్ రెడ్డిని చెడుగుడు ఆడేసుకున్న రేవంత్‌ రెడ్డి

ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.. కాస్త కేసీఆర్‌పై విమర్శలు తగ్గించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై విమర్శలు పెంచినట్టుగా అనిపిస్తోంది కదా. ఇటీవల వరకు ఆయన బీఆర్ఎస్‌, కేసీఆర్‌, కేటీఆర్‌ను మాటలతో ఆడుకున్నారు. కానీ గత పది రోజులుగా చూసుకుంటే.. కేసీఆర్‌ నుంచి గాలి కిషన్‌రెడ్డి వైపు మళ్లినట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ రెడ్డి, కిషన్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్స్‌కి చేరింది. అసలు కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారంటూ రేవంత్‌ దుయ్యబడుతున్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఏమైనా కృషి చేశారా.. అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి కావాలనే కిషన్‌రెడ్డి ప్రాజెక్టులు రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటున్నారని కూడా విమర్శించారు.

నిన్న కొత్త ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో టీపీసీసీ సమావేశం జరిగింది. ఇక్కడ కూడా కిషన్‌రెడ్డిని విమర్శించడంలో ఏ మాత్రం తగ్గలేదు,. ఆయనను రేవంత్‌ రెడ్డి చెడుగుడు ఆడేసుకున్నారు.

తాను మోదీ, కిషన్‌రెడ్డి ఆస్తులను అడగడం లేదని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ” బీహార్,ఉత్తర్ ప్రదేశ్‌కి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకి కేంద్రం ఇవ్వడం లేదు. మెట్రో రైల్ ఫేజ్ 2 కట్టడానికి డబ్బులు ఉన్నాయని.. కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నారు. కిషన్ రెడ్డి వంద శాతం సైందవ్ పాత్ర పోషిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం లేనే లేదు. కేంద్ర క్యాబినెట్ ఎజెండాలో ఈ అంశాలు లేకుండా ఒత్తిడి తెచ్చింది ఎవరు?. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి 6 ఏళ్లు పూర్తయింది. మీరు తీసుకువచ్చిన ప్రాజెక్టులు ఏవి..?. మీరు భయపెడితే ఎవరూ ఇక్కడ భయపడే వాళ్ళు లేరు కిషన్ రెడ్డి. ఆరేళ్లలో ఒక్కసారి అయినా తెలంగాణకు కావాల్సినవి మోదీ దగ్గర చెప్పారా..?.. కిషన్ రెడ్డి కేసీఆర్ అధికారం పోయిందని బాధపడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ చీకటి ఒప్పందం ప్రజలకు వివరిస్తాం. జనాభా ప్రాతిదికన పార్లమెంట్ సీట్ల పెంపు అనేది పెద్ద కుట్ర”.. అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలకు క్లాస్‌ తీసుకున్నారు. మంచిని మైక్ లో చెప్పాలని… చెడును చెవిలో చెప్పాలని రేవంత్‌ అన్నారు. కానీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..” కార్యకర్త మనసు ఎరిగిన నాయకురాలు మీనాక్షి నటరాజన్. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మంచి రోజులు వచ్చాయి.పార్టీ జెండా మోసినవారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది.పార్టీ కోసం కష్టపడినవారికే నామినేటెడ్ పదవులు ఇచ్చాం. సుదీర్ఘకాలంగా పని చేసినవారికి కొంతమందికి అవకాశాలు రాలేదు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. రాబోయే రోజుల్లో వారికి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తాం. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉంది. మార్చి 10 లోగా అన్ని జిల్లాల్లో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నాం. పదవులు వచ్చిన వారూ పార్టీ కోసం కష్టపడాలి. పనితీరు సరిగా లేని వారికి రిన్యూవల్ ఉండదు”..అని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్