ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు గంగాధర నెల్లూరులోని రామానాయుడుపల్లె చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. గ్రామంలో పర్యటించి, పలువురు లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించనున్నారు.
గ్రామంలో 10 సుత్రాల కాన్సెప్ట్‌తో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించనున్నారు సీఎం. అలాగే గ్రామంలో నిర్వహించే ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అనంతరం స్థానిక టీడీపీ నేతలను కలిసి వారికి దిశానిర్దేశం చేయనున్నారు.