బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం పెడుతున్న కేసులను ధీటుగా ఎదుర్కొందామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గత రెండు రోజులుగా పార్టీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేస్తున్నారు. కేటీఆర్ కేసును సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. దానిపై పదే పదే మాట్లాడొద్దన్నారు. కేసులపై న్యాయపోరాటం చేద్దామని పార్టీ నేతలతో అన్నారు. కేసులను ఎదుర్కొందామని చెప్పారు.
” కేసులు మనకు కొత్తేమీ కాదు. ఉద్యమ సమయంలో ఇలాంటి కేసులను ఎన్నో చూశాము. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మనం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో పడొద్దు. రైతు భరోసాపై గ్రౌండ్ లెవెల్‌లో రైతులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టొద్దు”.. అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
త్వరలో రైతు భరోసాపై దీక్షకు గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ లేదా రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా దీక్ష వుండే అవకాశం ఉందని సమాచారం.