29.7 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

గత బీఆర్ఎస్ పాలనపై రేవంత్ ప్రభుత్వం పూర్తి ఫోకస్

     ఇటీవలే సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం పాలనపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ఎండగడుతూనే అన్ని శాఖల అధికారులతో మంత్రులు సమీక్షలు నిర్వహించి పలు సూచనలు చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి పర్యటిం చారు. ప్రాజెక్టుల పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఇక రీ డిజైన్‌ పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ మంత్రులు ఏమంటున్నారు.?తక్కువ ఖర్చుతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేసింది.? ప్రాజెక్టుల పై గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ అసలు ఉద్దేశం ఏంటి?

    ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజాధనం దోపిడీ జరిగిందని తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటిలు భద్రాద్రికొత్తగూడెం జిల్లా అమ్మగారి పల్లి వద్ద ఉన్న సీతారామహెడ్ రెగ్యులేటరీ పనులను,వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడి నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌజ్-1 వద్దకు చేరుకుని పంప్ హౌజ్ పనులను పరిశీలించారు. అనంతరం పంప్ హౌజ్ పవర్ సప్లైను ప్రారంభించారు. ఆ తర్వాత పంప్ హౌజ్-3 వద్దకు చేరుకుని ప్రాజెక్టు పురోగతి పై ఇరిగేషన్ అధికా రులతో సమీక్షించారు. ఈనేపథ్యంలోనే అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూసేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావాల్సిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను వివరించారు.

   గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని మంత్రులు ఫైర్ అయ్యారు. 2వేల 654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టు పనులను సీతారామ ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి 20వేల కోట్లకు పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు.దశాబ్ద కాలం పాలనలో సీతారామ ప్రాజెక్టుపై 8వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి సాగునీరు ఇవ్వలే దన్నారు. సీతారామ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ కెనాల్‌ లింక్ చేయడానికి ఏన్కూరు లింక్ కెనాల్‌ను పూర్తి చేసేందుకు 72కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ముందు ఈ పనులకు సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వైరాకు వచ్చి శంకుస్థాపన చేశారన్నారు. పంపులు ట్రయల్ రన్ చేయడానికి కావాల్సిన పవర్ సప్లై కోసం నిధులు ఇచ్చామన్నారు. ఏన్కూరు లింక్ కెనాల్‌ను రాజీవ్ సాగర్ కెనాల్‌గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ -1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు మంత్రి భట్టి.

   మాజీ సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో ఇరిగేషన్ సెక్టార్‌ను నాశనం చేశారని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి విమర్శించారు.ప్రణాళిక లేకుండా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో ఇరిగేషన్ శాఖకు తీరని నష్టం జరిగిందన్నారు. దీని వల్ల రాష్ట్ర౦ కోలుకోలేని విధంగా నష్టపోయిందన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 94వేల కోట్లు ఖర్చు చేయగా 93వేల ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 27వేల కోట్లు ఖర్చు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క ఎకరాన్ని కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేష న్ ప్రాజెక్టుకు 9వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరం కొత్త ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేద న్నారు. కొత్తగూ డెం, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 2వేల కోట్లతో పూర్తయ్యే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లను రీ డిజైన్ చేసి 20వేల కోట్లకు గత ప్రభుత్వం పెంచడం వెనుక ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికే అని విమర్శించారు. రీ డిజైన్ పేరుతో తప్పుడు నిర్ణయం తీసుకుని రాష్ట్రానికి ఆర్థిక భారం మోపినప్పటికీ సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

   ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తైతే పది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 1997-98లో గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడి జైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా అప్పటి ప్రభుత్వం నామకరణం చేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపుతూ రీ డిజైన్ చేసిందన్నారు. అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయాల్సిన పనుల ను 20వేల కోట్లకు రీ డిజైన్ చేసి రైతులకు ఒక్క ఎకరానికి గత ప్రభుత్వం సాగునీరు అందించలే దన్నారు .ప్రస్తుతం జరుగుతున్న కెనాల్ పనులను పూర్తి చేసి లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కెనాల్‌కు అను సంధానం చేయడం వలన రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. హెడ్ వర్క్స్ ద్వారా కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా సాగు నీరు అందించే వీలు కలుగుతుందన్నారు. సత్తుపల్లి, జూలూరుపాడు ప్రాంతాలలో ఉన్న పనులు పూర్తైతే గోదావరి జలాలు రైతులకు అందుతాయ న్నారు. ప్రగళ్లపల్లి లిప్ట్‌ ఇరిగేషను పూర్తి చేస్తే దుమ్ముగూడెం, భద్రాచలం రైతులకు సాగునీరు అందుతుందన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని,రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం భేషజాలకు పోకుండా ప్రజల సంక్షేమానికే పాటుపడుతుంద న్నారు. గత బీఆర్ఎస్ హయాంలో చేతికి దొరికినంత అప్పులు తెచ్చి విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేశారన్నారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన కేసీఆర్ ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నారు. ఆలోచన లేకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రజాధనాన్ని దుబారా చేశార న్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2వేల 600కోట్లతో చేపట్టిన రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ పేరుతో 19వేల కోట్లతో చేపట్టి నిధులను దుర్వినియోగం చేశార న్నారు. 9వేల కోట్లు నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నా ఒక్క ఎకరానికి ఉమ్మడి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్