ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు బదిలీపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. రేవంత్ విచారణను ప్రభావితం చేస్తారనేది ఆపోహే అని తెలిపింది. జగదీష్ రెడ్డి పిటిషన్‌ను ఎంటర్‌టైన్ చేయలేమని కోర్టు చెప్పింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి ఆదేశాలిచ్చింది. రేవంత్‌కు కేసు విషయాలు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఎం రేవంత్ కేసులో జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది.