కాంగ్రెస్ హయాంలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయన్నారు మాజీమంత్రి హరీష్ రావు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక కోట్ చేస్తూ హరీష్ రావు ట్విట్ చేశారు. కొత్త కంపెనీల సంఖ్య పడిపోవడం, లక్ష్యాన్ని చేరుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అసలైన మార్పు అని హరీష్ రావు దుయ్యబట్టారు.