18.7 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

ఇప్పుడెలారా… భగవంతుడా?

ఐటీ ప్రపంచంలో ఉలికిపాటు. లక్షలాది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇప్పటికి 3లక్షల మందికి పైగా ఉద్యోగాలు పోయి…రోడ్లపైకి వచ్చారు. ఏం జరుగుతుందో తెలిసేసరికి…తెల్లారేసరికి చేతిలో పింక్ స్లిప్పులు కనిపిస్తున్నాయి. ఒకొక్క టెక్ బాధితులు తమ కథలను తెలిసిన వారి వద్ద పంచుకుంటున్నారు. అవేమిటో మీరే చూడండి…

కొత్త ప్రాణాన్ని ఎలా పోషించాలి?

మా ఆవిడ డెలివరీ కోసం ఆసుపత్రిలో ఉంది. నేను ఒక్కరోజు సెలవు పెట్టా…ఈలోపు నా ఆఫీసు కనెక్షన్ ఊడిపోయింది. తీరా మెయిల్ చెక్ చేస్తే…లే ఆఫ్ బాధితుల్లో నేనూ ఉన్నానని తెలిసింది. ఇప్పుడామెకు ఎలా చెప్పాలి? ఈ భూమ్మీదకు వస్తున్న కొత్త ప్రాణాన్ని ఎలా పోషించాలి?

నా పెళ్లి గోల

ఇండియాలో నాకు పెళ్లి కుదిరింది. తాంబులాల కార్యక్రమం ఘనంగా జరిగిపోయింది. నేను అమెరికా వచ్చేశాను. పెళ్లికి సెలవు కావాలని వెళితే, ఏకంగా సెలవు తీసుకోమని చెప్పేసరికి షాక్ అయ్యా. నేను వెంటనే ‘పెళ్లి క్యాన్సిల్’ అని చెప్పాను. అంతే వాళ్లు గోలగోల. పెళ్లి కూతురు ఏడుపు… నేను ఇండియా రానంటే రానని భీష్మించుకు కూర్చున్నాను.

మొత్తానికి అమెరికాలో పెళ్లి కూతురు బంధువులు ఒక ఉద్యోగం చూస్తే, అందులో చేరాను. అయినా నేను ఇండియా వెళ్లలేదు. మొత్తానికి పెళ్లి కూతురు, తల్లిదండ్రులు అమెరికా వచ్చారు. ఇక్కడే పదిమంది సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నాను. ఇదీ నా కథ అని ఒకరు రాశారు.

అమ్మ ఆసుపత్రిలో ఉంది…

అమ్మకి ఆరోగ్యం బాగాలేదని సెలవు పెట్టాను. ఇంక ఆఫీసుకి రావక్కర్లేదని మెయిల్ వచ్చింది. ఇప్పుడాసుపత్రి బిల్స్ అవీ ఎలా కట్టాలి. తర్వాత ఖర్చులన్నీ ఎలా భరించాలి? మళ్లీ ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? ఎలా? జీవితం అని తలచుకుంటేనే భయంగా ఉంది.

జీతం ఉంది కదా అని…ఇల్లు కట్టి, ఇన్సూరెన్సులు కట్టేశా…

లక్షల రూపాయల జీతం ఉంది కదా అని, లగ్జరీగా ఇల్లు కట్టాను. రెండేసి కోట్లకు భార్యకు, నాకు కూడా ఇన్సూరెన్స్ చేయించా…నెలకి రూ.60 వేలు బ్యాంక్ లోన్ కట్టాలి. ఇప్పుడా ఈఎంఐలు ఎలాగరా? భగవంతుడా? అనుకుంటే, ఇన్సూరెన్సులు పీకల మీదకి వచ్చి కూర్చున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. ఇది మరొకరి కన్నీటి కథ

ఉద్యోగం ఉంది కదా అని… చిల్ బ్రో అంటూ తిరిగా!

క్యాంపస్ లోనే ఉద్యోగం, లోకం తెలియక ముందే కళ్ల ముందు స్వర్గం, ఇంటికి దూరం, చెప్పేవారు లేరు. చూసే వారు లేరు. ఐదురోజులు పని చేయడం, రెండు రోజులు ఎంజాయ్ చేయడం, రూపాయి దాయలేదు. అలవాట్లు మాత్రం అంటుకుపోయాయి. సిగరెట్ కాల్చకుండా ఉండలేను. మందు కొట్టకుండా ఉండలేను. అప్పులు అప్పుల్లాగే ఉన్నాయి. ఉద్యోగం ఊడింది. ఇప్పుడు నెలంతా గడవడమే కష్టంగా ఉంది అంటూ ఒక ఐటీ ఉద్యోగి రాసుకొచ్చాడు.

ఇక భార్యాభర్తలు ఇద్దరి ఉద్యోగాలు పోయిన వాళ్లూ ఉన్నారు. ఒకరిది పోతే, ఒకరిది ఉందిలే అనుకోవడానికి కూడా లేదు. చాలామంది అప్పుల కోసం స్నేహితులకు ఫోన్లు చేస్తున్నారు. కొందరు సహాయం చేస్తున్నారు. కొందరు లేవు అంటున్నారు. కొందరు మన పరిస్థేమిట్రా భగవంతుడా? అనుకుంటున్నారు.

ప్రస్తుతం ఐటీలో ఎవరికి కంటి మీద కునుకు ఉండటం లేదు. భయంభయంగా ఉద్యోగాలకు వెళ్లి వస్తున్నారు. ఈరోజు ఆఫీసుకి వెళ్లాం. ఉద్యోగం ఉంది…ఓకే అనుకుంటున్నారు. అయితే కొన్నిరోజులు మాత్రమే ఆర్థిక మాంద్యం ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచమంతా టెక్నాలజీ మయమైంది కాబట్టి, ప్రతీచోటా ఐటీ నిపుణుల అవసరం ఉందని చెబుతున్నారు. తొందరపడి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.

అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని, ఐటీ ఉద్యోగులు తమ జీతాల్లో కనీసం 30 శాతం సేవింగ్స్ లో పెట్టకపోతే రాబోవు రోజుల్లో ఇలాంటి చీకటి రోజులు మరికొన్ని చూడక తప్పదని అంటున్నారు.

Latest Articles

ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్…ప్రి ఎస్టిమేటెడ్ ప్లాన్ పై ఎన్నో ఆశలు, ఊహాగానాలు

ప్రీ ఎస్టిమేటెడ్ ప్లాన్, నిర్దిష్ట కాలానికి ఆదాయ వ్యయాల అంచనా, నిర్వచించిన కాలానికి జమలు,ఖర్చుల అంచనా, ఆదాయ వ్యయ ప్రణాళిక... ఇవన్నీ బడ్జెట్ నిర్వచనాలే. రాబోయే ఆర్థిక సంవత్సరానికి, గత ఏడాది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్