స్వతంత్ర వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే ఎవరి సీటుకు ఎర్త్ పడుతుందో అనే టెన్షన్ పలువురు రాజకీయ నాయకులు లోలోపల మధనపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కారణంగా నా సీటు పోతుందంటే పోనివ్వండి అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ప్రారంభోత్సవ ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్..’భారత పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లు కారణంగా అవసరం అయితే స్థానాన్ని వదులుకోవడానికి కూడా నేను సిద్ధం. మనందరివి చాలా చిన్న జీవితాలు. అందులో నేను చేయాల్సిన పని చేసేశా’ అంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.