స్వతంత్ర వెబ్ డెస్క్: ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా రెండో రోజు రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించానని అన్నారు. గత ఏడాది చేసిన వాగ్దానాన్ని మరిచిపోయారని అన్నారు. మీ అందరికి అవసరమైన బలాన్ని ఇచ్చానని.. మీ వెంటే నేను ఉంటాను అన్నారు. ఆలస్యమైనా వర్షాలు కురుస్తాయని.. అగ్ని ప్రామాదాలు జరుగుతాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఐదు వారాల పాటు నైవేద్యాలు సమర్పించాలని అన్నారు. నా వద్దకి వచ్చిన వారిని చల్లగా చుసుకునే బాధ్యత నాదన్నారు. 5 వారాలు నాకు సాక పోయండి నాయన అన్నారు. ఏడూ వచ్చేసరికి నాకు తప్పని సరిగా జరిపించండని తెలిపారు. దీంతో రంగం కార్యక్రమం భవిష్యవాణి పూరైంది. ప్రవచనం వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. పోతరాజుల ఊరేగింపు, ఘటోస్తవం ఘనంగా జరుగుతుందని మంత్రి అన్నారు. లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. రాత్రి అంత దర్శనాలు జరిగాయన్నారు.