రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సిల్వర్ డేల్ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన కాల్వలోకి వెళ్ళింది. ఈ ప్రమాదానికి స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అంటున్నారు. బస్సును డ్రైవర్ వేగంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణమని విద్యార్థులు తెలిపారు. చేవెళ్ల మండలంలోని పలు గ్రామాల నుంచి 60 మందికి పైగా విద్యార్థులను ఈ స్కూల్ బస్సులో తీసుకెళ్తున్నట్లు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం ప్రమాద స్థలానికి రావాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులను బుజ్జగించి పంపించారు.