28.2 C
Hyderabad
Sunday, July 14, 2024
spot_img

సినీరంగంలో సామాజిక విలువలను పంచిన రామోజీ

   అక్షర దిగ్గజం….అస్తమయంతో ఒక రకంగా కలం మూగబోయింది. తెలుగు పత్రికలు నివ్వెరపోయాయి పత్రికా రంగం లో పాత్రికేయుల దుఃఖమంతా సంతాపాల తోరణాలుగా మారుతున్నాయి. మీడియా రంగంలో ఆయన చేసిన సేవలు ఎంతో మందికి జీవనోపాధిని అందించాయి. ఈ నేపథ్యంలో ఆయన తెలుగు సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. అద్భుత కళాఖండాలను ఆవిష్కరించారు. జాతీయ ఫిలింఫేర్ అవార్డలను అందుకున్నారు. తెలుగు వెండి తెర మరిచిపోలేని…నిత్య జీవితంలో స్ఫురణకు తెచ్చుకోవాల్సిన ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. మీడియా మొగల్ రామోజీ అస్తమయం మీడియా రంగంతోపాటు సినీరంగానికి తీరని లోటే రామోజీ సినీరంగ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

  రామోజీ అంటే కేవలం పత్రికా రంగమే కాదు. అంతకు మించి అన్నట్టు ఆయన జీవిత ప్రయాణం నడిచింది. రామోజీ వినోద రంగంలో కూడా తనదైన చరిత్రను సృష్టించారు. 1983లో ఉషా కిరణ్ మువీస్ బ్యానర్ స్థాపించారు. ఆ బ్యానర్ పై అద్వితీయమైన దాదాపు 87 చిత్రాలను వివిధ భాషల్లో ఆవిష్కరిం చడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొత్త నటీనటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అంతేకాదు ఉషా కిరణ్ బ్యానర్ పై నిర్మించిన చిత్రాలను విడుదల చేయడానికి మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కూడా స్థాపించారు.

  1983లో శ్రీవారి ప్రేమలేఖ సినిమాతో తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు రామోజీ. 1984లో జంధ్యాల దర్శక త్వంలో విడుదలైన శ్రీవారి ప్రేమలేఖ అత్యంత ప్రజాదరణ పొందింది. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు విలక్షణ చిత్రాల ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇండస్ట్రీలో కొత్త రచయితలను ప్రోత్సహించ డంతోపాటు కొత్తకథల ను కొత్తతరానికి అందించడంలో ఉషాకిరణ్ మువీస్  బ్యానర్ చిత్రపరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించింది. తక్కువ బబ్జెట్ తో సినిమాలు తీసి, హిట్ కొట్టడంలో రామోజీది ఒక స్పెషల్ స్కూల్.. ఆయన నిర్మించిన ప్రతీ సినిమా కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, కథా కదనంలో మార్పులు చేర్పులు చేయడం నుంచి సినిమా సెట్స్ వెళ్లే వరకు ఆయన టీంతో చర్చించే వారు. సినిమాను కేవలం వ్యాపారం రంగంగానే కాకుండా, విలువల పరంగా రామోజీ సామాజిక దృక్పథంతో చక్కటి చిత్రాలను రూపొందించారు.

  కథలనేవి కేవలం సృజనాత్మకత నుంచి కాకుండా జీవితాల్లో నుంచి రావాలని, ఉషాకిరణ్ మువీస్ నిరూపించింది. అందుకు ఉదాహరణగా నిలిచిన మయూరి చిత్రం ఉషాకిరణ్ బ్యానర్ నుండి నాలుగో చిత్రంగా విడుదలై జాతీయ స్థాయిలో సంచలనాలను సృష్టించింది. ప్రమాదంలో కాలును పోగొట్టుకుని, కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధా చంద్రన్ జీవితాన్ని తెరకెక్కించారు. ఆ పాత్రలో ఆమెనే నటింపజేశారు. వాస్తవ జీవితాన్ని ప్రేక్షకుల కళ్లకు కట్టారు. స్పూర్తిదాయకమైన ఆ చిత్రం విడుదలై దాదాపు రెండున్నర దశాబ్దాలు గడిచినా  ఉషాకిరణ్ మువీస్ అనగానే మయూరి సినిమా తప్పకుండా గుర్తొస్తుంది. ఈ చిత్రంలో నటనతో జీవించిన నటి, నృత్య కళాకారిణి సుధా చంద్రన్ కు బ్లాంక్ చెక్ ఇచ్చి, మీకు ఇష్టమైన అంకెవేసుకోండి అన్నారట రామోజీ. కళ పట్ల, కళాకారుల పట్ల రామోజీకున్న నిబద్ధత మార్యా దను ప్రకటించుకున్నారు.

  మానవ జీవితానికి అద్దం పట్టే సామాజిక అంశాలనే కథలుగా స్వీకరించడం ఒక ఎత్తైతే యధార్థ సంఘటనలను వెండితెరకు పరిచయం చేయడంలో ఉషాకిరణ్ మువీస్ బ్యానర్ కుఎంతో ప్రత్యేకత ఉంది. అప్పట్లో ఒడిశాలో జరిగిన సంఘటన ఆధారంగా మౌనపోరాటం చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ పేరుతో మోసపోయిన ఒక వనిత పోరాట జీవితాన్ని, వెండితెరపైకి ఎక్కిచడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆ చిత్రం 1989లో విడుదలై ప్రేక్షలను కన్నీటి పర్యంతం చేసింది. ప్రజలను ఆలోచింపజేసింది.

  రామోజీ తన శక్తివంతమైన చిత్రాలతో మహిళల హక్కులు, సమానత్వ సాధనకు అనేక ఇతర మానవ సంక్షేమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో విశేషమైన స్థానాన్ని పొందారు. సినిమాలకు స్క్రిప్ట్‌లను ఎంచుకుని ప్రేక్షకుల ముందు కు తీసుకురావడంలో రామోజీది ఒక ప్రత్యేక శైలి. ఈ నేపథ్యంలోనే ఉషా కిరణ్ బ్యానర్ పై ప్రతిఘటన చిత్రంలో ఒక స్త్రీ పాత్రను ఎంతో ఔన్నత్యంగా తీర్చిదిద్దారు. సంఘ విద్రోహ శక్తులతో పోరాడే తెగువ గల ఒక వనిత పాత్రను తెరకెక్కిం చడంలో ఎంతో సాహసం చేశారు.ఆ చిత్రంలో ఈ దుర్యోధన అంటూ సాగే పాటను ఏతరం మరిచిపోలేదు. ఈ పాటలోని సాహిత్యాన్ని ఆమోదించడానికి ఎంతో సానుకూల దృక్పథం ఉండాలి. అది ఉండబట్టే గీత రచయిత వేటూరితో ఈ పాట రాయించ గలిగారు.

   పరుగుల పందెంలో రారాణిగా ఎదిగిన క్రీడాకారిణి అశ్విని నా చప్పను కెమెరా ముందుకు తీసుకువ చ్చింది కూడా ఈ సంస్థే.. ఆ క్రీడాకారిణి జీవిత నేపథ్యాన్ని స్పూర్తి దాయకంగా నిర్మించారు రామోజీ. ఈ చిత్రంలో ఆశ్వని పాత్రకు అశ్విని నా చప్పను ఎంచుకున్నారు. క్రీడలకే పరిమితమైన ఆమె, కథలోని బలాన్ని  బ్యానర్ గొప్పతనాన్ని గ్రహించి నటించారు. ఇదే వరుసలో తేజ , మనసు మమత , అమ్మ, జడ్జి మెంట్, పీపుల్స్ ఎన్ కౌంటర్ వంటి చిత్రాలు నాటి సామాజిక పరిస్థి తులకు అద్దం పట్టాయి . చిత్రం, నువ్వే కావాలి. ఆనందం వంటి సినిమాల ఘన విజయాలను ఉషాకిరణ్ మువీ బ్యానర్ తన ఖాతాలో వేసుకుంది.

  సమాజం విలువలు వంటి అంశాలపై రామోజీ ఎంతో శ్రద్ధ పెట్టారో…అంతే శ్రద్ధ హాస్యభరిత చిత్రాలపైన పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులను ఉల్లాసపరిచే చిత్రాలు నిర్మించారు. ఆ కోవలో నచ్చావులే, బెట్టింగ్ బంగార్రాజు, నువ్విలా చిత్రాలు మంచి వసూళ్లు సాధించి రికార్డు సృష్టించాయి. ఉషాకిరణ్ మువీస్ బ్యానర్ కేవలం తెలుగు చిత్రాలకే పరిమితంగా కాలేదు. నాచే మయూరి, ప్రతిఘాత్ చిత్రాలతో బాలీవుడ్ లో సైతం విజయ కేతనం ఎగరవేసింది ఉషా కిరణ్ మువీస్. కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో దాదాపు 87 చిత్రాలు నిర్మించింది.

   చిత్ర పరిశ్రమలో సినిమా తీయడం ఒక ఎత్తైతే దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడం మరో ఎత్తు. అందుకే చిత్ర నిర్మాణంతోపాటు మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థను స్థాపించి, ,చిత్రపంపిణీ విభాగంలోనూ శ్రీకారం చుట్టారు. రామోజీ నిర్మించిన శ్రీవారి ప్రేమలేఖ ప్రేక్షకుల ఆదరణతోపాటు ప్రభుత్వ పురస్కారాలను పొందింది. కాంచనగంగ, మయూరి, ప్రతిఘటన, తేజ, మౌనపోరాటం వంటి పలు చిత్రా లకు నంది అవార్డులు దక్కాయి. మయూరిలో నటించిన సుధా చంద్రన్ కు జాతీయ అవార్డ్ దక్కింది. అలాగే నువ్వే కావాలి, సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. అంతేకాదు ఉషాకిరణ్ మువీస్ బ్యానర్ పై నిర్మించిన చిత్రాల్లో నూతన నటీనటులకు అవకాశం కల్పిం చారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది నటీనటులు. నటులుగా వెండితెరపై సుస్థిర స్థానాన్ని సంపాదిం చుకున్నారు. మొత్తంగా చూస్తే సినీరంగంలో కూడా రామోజీ తనదైన శాశ్వత కీర్తిపతాకాన్ని ఎగరవేశారు.

Latest Articles

ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు ఆర్ కృష్ణయ్య పిలుపు

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ.. ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్