దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ముస్లీం ప్రజలు జరుపుకునే పవిత్రమైన పండుగ రంజాన్. ఈద్ సందర్భంగా మసీదులు , గ్రౌండ్ లలో నమాజ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమస్త మానవాళికి మంచి జరగాలంటూ ముస్లిం సోదరులు అల్లాను వేడుకుంటున్నారు. సామూహిక నమాజ్ లతో మసీదుల దగ్గర ఆధ్యాత్మిక వాతావ రణం నెలకొంది.


