ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని.. ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని పిటిషన్‌లో తెలిపారు వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తుండటం చట్ట విరుద్ధమన్నారు. ఇకపై కేసులు పెట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని, ఇప్పటి వరకు నమోదైన కేసులను క్వాష్ చేయాలని తమ పిటిషన్‌లో కోరారు రామ్‌గోపాల్ వర్మ. మరోవైపు వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారించే అవకాశముంది. దీంతో కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో పోలీసు విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆర్జీవీ. దీంతో వర్మ కోసం పోలీసు బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. విచారణకు హాజరుకాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వర్మపై పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు.