స్వతంత్ర వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా … ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో అంజలి, సునీల్ , శ్రీకాంత్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి కేవలం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మినహాయిస్తే పెద్దగా ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు. అలాగే ఈ సినిమా యొక్క విడుదల తేదీని ఇప్పటికి కూడా ప్రకటించకపోవడంతో చరణ్ అభిమానులు ఈ సినిమా టీమ్ పై కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన కొత్త షెడ్యూల్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ ఈ సోమవారం నుండి హైదరాబాదు లో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న మరి కొంత మంది కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. కాగా, దర్శకుడు శంకర్ కూడా తాజా షెడ్యూల్ పై సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు. నిన్నటి నుంచి హైదరాబాదులో మా గేమ్ చేంజర్ కు సంబంధించి ఓ భావోద్వేగ భరిత సన్నివేశానికి నగిషీలు చెక్కుతున్నాం అని శంకర్ వివరించారు. ఈ మేరకు ఓ వర్కింగ్ స్టిల్ ను కూడా పంచుకున్నారు.
ఇకపోతే ఈ షెడ్యూల్ లో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అద్భుతమైన క్రేజ్ ఉన్న చరణ్ , శంకర్ కాంబో లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీపై క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతున్నది. ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతుందని అందరూ లెక్కలు వేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ బిజినెస్‌కు మంచి ధర పలికిందనే విషయం మీడియాలో హల్‌చల్‌గా మారింది.
గేమ్ ఛేంజర్ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోవడానికి టాప్ ఓటీటీ సంస్థలు పోటీపడ్డాయి. అయితే భారీ పోటీ మధ్య ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సంస్థ ఫ్యాన్సీ రేట్ చెల్లించి సొంతం చేసుకొన్నట్టు సమాచారం. రిలీజ్‌కు ముందే ఈ సినిమా బిజినెస్ డిజిటల్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. గేమ్ ఛేంజర్ సినిమా అన్ని భాషల హక్కులను సుమారు 250 కోట్ల రూపాయలకు జీ5 సంస్థ సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. అయితే నిర్మాత దిల్ రాజు గానీ, ఆయన యూనిట్ వర్గాలు కానీ ఈ వార్తను అధికారికంగా వెల్లడించలేదు. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్‌కు ముందే 250 కోట్ల రూపాయలు రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను 200 కోట్ల రూపాయలతో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.