ఆస్కార్ వేడుకల అనంతరం తిరుగుప్రయాణమైన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan ) దంపతులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. చరణ్ ను చూడగానే సంతోషంతో ఊగిపోయిన అభిమానులు.. ‘జై చరణ్’, ‘జై ఆర్‌ఆర్‌ఆర్’ అనే నినాదాలు చేశారు. దీంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం మార్మోగింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. అభిమానులకు అభివాదం చేసి.. తనపై ఇంతటి ప్రేమను చూపిస్తోన్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన వాహనం వెనుకే అభిమానులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.