స్వతంత్ర వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ ఈరోజు రాత్రి 11 గంటలకు పెళ్లి చేసుకోబుతున్నారు. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ వేదికగా రెండు రోజులపాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కాబోయే వధూవరులకు హల్దీ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శర్వానంద్ సంగీత్‌కు అత్యంత సన్నిహితుడు రామ్ చరణ్ కూడా హాజరైయ్యారు. ఇక శర్వానంద్‌కు కాబోయే భార్య రక్షిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని తెలుస్తోంది. ఇక ఆమె తండ్రి తెలంగాణ హైకోర్ట్ లాయర్ మధుసూదన్‌రెడ్డి. తల్లి సుధారెడ్డి. శర్వానంద్ వివాహాం రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో జూన్ 3న జేష్ట్య మాసం పౌర్ణమి రోజున పండితులు నిర్ణయించిన ముహూర్తాన పెళ్లి జరగనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ పెళ్లి వేడుక రోజు రాత్రి 11 గంటల నుంచి ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి నందమూరి, మెగా (కొణిదెల), అక్కినేని, దగ్గుబాటి, ఘట్టమనేని, ఉప్పలపాటి ఫ్యామిలీలు హాజరయ్యే అవకాశం ఉంది.