స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత తనను కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ రమ్మని అడుగుతున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే తాను మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన.. తెలంగాణలో గెలవలేదని.. ఇక్కడి పరిస్థితులు వేరుగా ఉంటాయని తెలిపారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో దుష్ప్రచారాలతో బీజేపీని బలహీనం చేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం కింద బ్లాక్ మెయిల్ చేసి రూ.కోట్లు సంపాదించారని ఆరోపించారు. టీడీపీలో నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ నాయకత్వంలో ఎలా పని చేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ ను గద్దె దించడానికే బీజేపీలో చేరానని.. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే గట్టి పోటీ ఇవ్వగలదన్నారు. తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని.. ఎవరూ లాబీయింగ్ చేయడం లేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.


