MP Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం తనను కంటతడి పెట్టించిందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గాంధీభవన్ వద్ద చేపట్టిన దీక్షలో ఎంపీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీకి వచ్చినా.. అయన వదులుకున్నారని అన్నారు . అదానీ గురించి పార్లమెంట్‌లో రాహుల్ మాట్లాడినప్పటి నుంచి రాహుల్ గాంధీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అదానీ గురించి రాహుల్ మాట్లాడతారనే భయం బీజేపీలో మొదలైందని…అందుకే పరువునష్టం కేసులో శిక్ష పడేలా చేశారని అన్నారు. రాహుల్ పై అనర్హత వేటు ఎత్తివేసే వరకు కాంగ్రెస్ శ్రేణులు కలిసి కట్టుగా పోరాడాలని అన్నారు. అవసరమయితే కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. ఇంధిరాగాంధీపై వేటు వేస్తే ఏం జరిగిందో.. ఇప్పుడు అదే జరుగుతుందన్నారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి.
Rahul Gandhi's disqualification brought tears to his eyes: MP Komatireddy Venkat Reddy