30.6 C
Hyderabad
Monday, April 21, 2025
spot_img

Savings: ఆర్థిక ఇబ్బందుల బారిన పడకూడదంటే.. ఇలా చేయండి..

Savings: గతంతో పోలిస్తే నేటి ఆధునిక కాలంలో పొదుపుపై చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సంపాదించడం, ఖర్చు చేయడం, అవసరమైనంత ఎంజాయ్ చేయడం.. ప్రస్తుతం చాలామంది ఆలోచన ఇలాగే ఉంటుంది. భవిష్యత్తు సంగతి తర్వాత చూద్దాంలే అనే ఆలోచనలో ఉంటున్నారు కొంతమంది. పూర్వం పొదుపునకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే ఉన్న సంపాదనలోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. పిల్లలను చదవించి.. వారి ఉన్నతికి తోడ్పాటునందిస్తూ వచ్చారు. ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తున్నా.. నెలయ్యేసరికి అప్పులు చేయాల్సి పరిస్థితి.. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రిటైర్మెంట్ తర్వాత పరిస్థితిని తలచుకుంటే తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులు తప్పవనే సంకేతాలు వెలువడతాయి. కాని అలా ఆర్థిక ఇబ్బందులు రాకుండా.. వచ్చినా వాటిని తట్టుకోవాలంటే జీవితంలో పొదుపు తప్పనిసరి. కొంత మందికి పొదుపు యొక్క ప్రయోజనాలు తెలియక దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే పొదుపు చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం. రిటైర్మెంట్ ప్లాన్ అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కోకరిది ఒక్కో విధంగా ఉంటుంది. భవిష్యత్తు కోసం చేసే పొదుపు వ్యక్తి యొక్క నెలవారీ ఆదాయం, అతడి ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. చేసే ఉద్యోగం ఆధారంగా కూడా మన పొదుపు ఆధారడి ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొంత వరకూ ఆరోగ్య బీమా కవరేజ్ ఉంటుంది. కానీ ప్రైవేట్ ఉద్యోగులకు ఆ వెసులుబాటు ఉండదు. ఇలాంటి విషయాలన్నీ క్షుణ్నంగా ఆలోచించి మన అవసరాలకు తగినట్టుగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఉద్యోగ విరమణ తర్వాత మన భవిష్యత్తును ప్లాన్ చేసుకునే విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాని ముందునుంచి సరిగ్గా ప్లాన్ చేసుకున్న వ్యక్తి రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.

ప్రతి వ్యక్తి ఆరోగ్య బీమా తగినంత ఉందో లేదో చూసుకుని ఒకవేళ తగినంత లేకపోతే కొత్తది తీసుకోవాలి. తాము తీసుకున్న ఆరోగ్య బీమా మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పాలసీలో ఆ వ్యాధులకు కవరేజ్ లేకపోతే వాటికి కవరేజ్ ఇచ్చే టాప్‌అప్ లేదా కొత్త పాలసీ ఎంచుకోవాలి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తప్పకుండా తీసుకోవాలి.

ఆరోగ్య బీమా తర్వాత అత్యంత ముఖ్యమైనది జీవిత బీమా.. ఏదైనా దురదృష్టకరమైన పరిస్థితులు జరిగినప్పుడు.. కుటుంబాన్ని కాపాడే మొదటి రక్షణ కవచం జీవిత బీమా. లైఫ్ ఇన్య్సూరెన్స్ లేకపోతే.. ప్రస్తుతం మనం పొందే అవకాశం ఉంటే వెంటనే జీవిత బీమా తీసుకోవాలి. చాలా కంపెనీలు యాభై ఏళ్లు దాటినవారికి జీవిత బీమా పాలసీ ఇచ్చేందుకు విముఖత చూపిస్తాయి. ఎన్నో ప్రశ్నలు వేసి పాలసీని తిరస్కరిస్తుంటాయి. కాబట్టి మన పరిస్థితిని బట్టి పాలసీ కోసం జాగ్రత్తగా ప్రయత్నించాలి. ఈ రెండు బీమా పాలసీలు మన రిటైర్మెంట్ ప్లానింగ్ విషయంలో అంతర్భాగమని గుర్తించాలి. ఎందుకంటే రిటైర్మెంట్ వయసు దగ్గర పడే కొద్దీ ఈ బీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బీమా తీసుకోవడం మంచిది. ఈ రెండూ ఉంటే మన జీవితం ఉద్యోగ విరమణ తర్వాత కూడా సాఫీగా గడిచిపోతుంది.

Latest Articles

దర్శకుల సమక్షంలో ‘ఏఎల్‌సీసీ’ బిగ్ టికెట్ లాంచ్

యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్