స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పుడైతే రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారో అప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. వేషధారణతో పాటు మాట్లాడే తీరు, జనాల్లో కలిసిపోయే ఓర్పు రాహుల్ ను భారత రాజకీయాల్లో మరోస్థాయికి తీసుకువెళ్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఓ లారీలో ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు ఆయన ప్రయాణించారు. అనంతరం అంబాలాలో ఆగి డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇందుకు సంబంధించిన వీడియోలను ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. దేశంలోని రోడ్లపై దాదాపు 90 లక్షల మంది ట్రక్ డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్ల ‘మన్ కీ బాత్’ వినే పనిని రాహుల్ చేశారని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ్ కీ నేత రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
जननायक @RahulGandhi जी ट्रक ड्राइवर्स की समस्या जानने उनके बीच पहुंचे।
राहुल जी ने उनके साथ दिल्ली से चंडीगढ़ तक का सफर किया।
मीडिया रिपोर्ट्स के मुताबिक, भारत की सड़कों पर करीब 90 लाख ट्रक ड्राइवर्स हैं। इनकी अपनी समस्याएं हैं। इनके 'मन की बात' सुनने का काम राहुल जी ने किया। pic.twitter.com/Bma2BCjGpY
— Congress (@INCIndia) May 23, 2023