22.5 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

వాషింగ్టన్ టూ న్యూయార్క్‌కు ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ గాంధీ

స్వతంత్ర, వెబ్ డెస్క్: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రవాస భారతీయులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వాషింగ్టన్‌ డీసీ నుంచి న్యూయార్క్‌ దాకా ఓ ట్రక్కులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో ట్రక్కు డ్రైవర్లు ఎలా పని చేస్తారు? ట్రక్కు ఫీచర్లు ఏమిటి? వారికి చలాన్లు పడతాయా? డ్రైవర్లు ఎంత ఆదాయం సంపాదిస్తారు? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. నెలకు రూ.8లక్షల దాకా సంపాదిస్తామని డ్రైవర్ చెప్పడంతో రాహుల్ ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను 2.25 లక్షల మందికి పైగా చూడగా.. 36 వేల మంది లైక్‌ చేశారు. కాగా గత నెలలో ఢిల్లీ నుంచి చండీగఢ్‌‌కు కూడా ఓ లారీలో ప్రయాణించిన సంగతి తెలిసిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్