ప్రభుత్వ వైఫల్యంతోనే ప్రయాగ్‌రాజ్ ప్రమాదం జరిగిందని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహాకుంభమేళా తొక్కిసలాట చాలాబాధాకరమన్న ఆయన… మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశించారు. నిర్వహణ లోపానికి తోడు వీఐపీల కోసమే అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఆక్షేపించారు. సామాన్య భక్తుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు. మహా కుంభమేళా మరికొన్ని రోజులు జరుగుతుందని… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ సూచించారు.