మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లోని సంగమం వద్ద అమృత స్నానాలకు భక్తులకు ఎగబడ్డాతొక్కిసలాటలో జరిగిన వెంటనే సిబ్బంది తక్షణమే స్పందించారు. గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌లో సెక్టార్2 ఆస్పత్రికి తరలించారు.
మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభామేళాకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రయాగ్‌రాజ్ మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇవాళ దాదాపు కోటి మందికి పైగా అమృత స్నానాలు ఆచరించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద 12 కిలోమీటర్ల పొడవున ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు.రు. భక్తుల తాకిడి కారణంగా అక్కడే ఉన్న బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. సంగమం వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 40 మందికి పైగా భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.