స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీని అద్భుతమైన మెజార్టీతో గెలిపించిన కర్ణాటక ప్రజలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బలవంతులపై బలహీనులు గెలిచిన విజయంగా ఆయన అభివర్ణించారు. తాము ప్రేమతోనే ఎన్నికలను ఎదుర్కొన్నామని అంతే అభిమానంతో కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్వేష రాజకీయాలను తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, నేతలకు అభినందనలు చెప్పారు. ఇకపై అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఐదు హామీలను తొలిరోజే నెరవేరుస్తామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వెల్లడించారు.