బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పేదల హక్కులను హరించి, ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యం అని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. పెద్దలకు బీజేపీ రుణమాఫీ చేస్తే, మాత్రం ఎవరూ అడగటం లేదన్నారు. ఈ ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరగుతున్నాయని చెప్పారు. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ ఉందని రాహుల్ స్పష్టం చేశారు.


