ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయనున్నారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కోల్పోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన స్వగ్రామం నీలకంఠాపురంలో పొలం పనులు చేసుకుంటూ కుటుంబంతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఆయన మళ్లీ రాజకీయాల్లోయాక్టివ్ కాబోతున్నారని సమాచారం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు సిటీ ఎన్నికల ఇంచార్జిగా ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ నియమించినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు రఘువీరా చేత ప్రచారం చేయించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంపై ఆయన స్థానిక కాంగ్రెస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్లు వెల్లడించారు.