Puvvada Ajay Kumar |బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. పేపర్లను లీక్ చేసే స్థాయికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిగజారటం దౌర్భాగ్యమని మంత్రి వ్యాఖ్యానించారు. ఖమ్మం 25వ డివిజన్ మేదర బజార్ లోని బస్తీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాజా రాజకీయా పరిస్థితులపై మాట్లాడారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఉద్దేశ్యంతోనే బండి సంజయ్ టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారని ఆరోపించారు. అవినీతికి తావు లేకుండా రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్‌ను విమర్శించడానికి ఏ కారణం లేకనే టెన్త్ పేపర్లను టార్గెట్ చేశారని అన్నారు.
Read Also: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ను అభినందించిన తెలంగాణ సీఎస్, డీజీపీ
Follow us on: Youtube, Instagram, Google News


